Maoists killed: ములుగు ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి - ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి
09:34 January 18
మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు గాయాలు
ములుగు జిల్లా వెంకటాపురం అటవీ ప్రాంతం కర్రెగుట్ట.. తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్ట్ జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందాడు.
మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అతన్ని హెలికాప్టర్లో హనుమకొండకు తరలించారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలో అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స చేశారు. ఇతనితో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కానిస్టేబుల్ మధు చేతి వేళ్లు తెగిపోగా... ఛాతిలో బుల్లెట్ దిగింది. మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తరలించారు.
ఇదీ చూడండి:Chandrababu Tested Corona Positive: తెదేపా అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్