తెలంగాణ

telangana

ETV Bharat / crime

Road Accident: మృత్యువులోనూ వీడని స్నేహబంధం.. ప్రమాదంలో ఇద్దరు మృతి

Road Accident: బాల్యం నుంచి వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరంటే ఒకరికి చాలా అభిమానం. ఊహించని రూపంలో వచ్చిన మృత్యువు వారిద్దరిని కబళించింది. మృత్యువు కూడా వారిద్దరి స్నేహబంధాన్ని విడదీయలేకపోయింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ వద్ద జాతీయ రహదారిపై జరిగింది.

Road Accident
Road Accident

By

Published : May 1, 2022, 12:44 PM IST

Road Accident: ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. ఏ పని చేసినా కలిసే చేసేవారు. ఇద్దరు పనిమీద బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా బోర్​ వెల్ బండి రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరిని కబళించింది. చావులోనూ వారి స్నేహబంధం విడదీయలేకపోయింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్ వద్ద సంగారెడ్డి-అకోలా జాతీయ రహదారి పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్ గ్రామానికి చెందిన సలీం(25), నిఖిల్(21) ఇద్దరు ప్రాణ స్నేహితులు. అయితే ఈరోజు ఉదయం సమయంలో ఇద్దరు కలిసి బైకుపై నిజాంపేట్ నుంచి పెద్దశంకరంపేట్ గ్రామానికి బయలుదేరారు. కొంత దూరం వెళ్లాక వెనక నుంచి అతివేగంగా వస్తున్న బోర్​ వెల్ బండి ఒక్కసారిగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సలీంను 108 వాహనంలో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. ప్రాణస్నేహితులైన వారిద్దరి మృతి ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సలీంకి ఇటీవలే పెళ్లి నిశ్చితార్థం జరిగింది.

ఇదీ చదవండి:భార్యను కొట్టి చంపిన భర్త.. సహకరించిన కుమారులు

ABOUT THE AUTHOR

...view details