తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఇద్దరు స్నేహితుల ప్రాణాలు తీసిన సెల్‌ఫోన్‌ వివాదం - two friends died in cell phone theft dispute in bhairapur

Friends suicide in Cellphone theft issue: సెల్​ఫోన్ చోరీ వివాదంలో ఇద్దరు స్నేహితులు తీసుకున్న క్షణికావేశ నిర్ణయం.. వారి ఉసురుతీసుకుంది. స్నేహితుడు ఫోన్ దొంగిలించి ఇవ్వలేదని ఒకరు పురుగుల మందు తాగగా.. చేసిన తప్పునకు పరిహారం చెల్లించలేక మరో వ్యక్తి ఉరేసుకున్నాడు. రోజుల వ్యవధిలో ఇరువురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

two friends died in cell phone theft dispute
సెల్​ఫోన్ వివాదంలో ఇద్దరు స్నేహితులు మృతి

By

Published : Apr 17, 2022, 2:21 PM IST

Friends suicide in Cellphone theft issue: ఒక సెల్‌ఫోన్‌ ఇద్దరి ప్రాణాలు బలిగొంది. తన స్నేహితుడు సెల్‌ఫోన్‌ దొంగిలించి ఇవ్వలేదని ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మృతికి కారణమంటూ గ్రామ పెద్దలు విధించిన జరిమానా చెల్లించలేక మరొకరు ఉరేసుకుని చనిపోయారు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం భైరాపూర్‌లో జరిగింది. స్నేహితుడు తన ఫోన్‌ దొంగిలించి ఇవ్వడం లేదనే మనస్తాపంతో ఈ నెల 12 మహేశ్‌(30) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజే మృతి చెందాడు.

ఇదిలా ఉండగా మహేశ్ మృతికి సాయిలు కారమణని.. 14న అతడి ఇంటిముందు మృతదేహంతో బంధువులు ఆందోళన చేశారు. గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని మహేశ్ కుటుంబానికి రూ. లక్ష పరిహారం చెల్లించాలని సాయిలు కుటుంబానికి సూచించారు. గ్రామ పెద్దలు విధించిన జరిమానా చెల్లించలేక.. శనివారం ఎడపల్లి మండలం బ్రహ్మణపల్లి అడవిలో ఉరేసుకుని సాయిలు ఆత్మహత్య చేసుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details