తెలంగాణ

telangana

ETV Bharat / crime

అజ్మీర్​కు వెళుతూ తల్లీకూతురు అనంతలోకాలకు.. - ts news

అజ్మీర్​కు వెళుతూ తల్లీకూతురు అనంతలోకాలకు..
అజ్మీర్​కు వెళుతూ తల్లీకూతురు అనంతలోకాలకు..

By

Published : Feb 21, 2022, 6:37 AM IST

Updated : Feb 21, 2022, 8:45 AM IST

06:32 February 21

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 15 మందికి తీవ్రగాయాలు

Bus Accident: మెదక్‌ జిల్లా హవేళిఘనపూర్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో తల్లీకుమార్తె మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్​ వాసులు అజ్మీర్​ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఘటనాస్థలికి మెదక్​ డీఎస్పీ సైదులు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కొందరు క్షతగాత్రులను మెదక్​ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. అతివేగం వల్ల వెనుక టైర్ పగిలిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడినట్లు డీఎస్పీ సైదులు వెల్లడించారు. ఆ బస్సులో 50 మంది వరకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. వారిలో అజీజ (45 ), జాయెద(16) మరణించారని వెల్లడించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం మెదక్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

Last Updated : Feb 21, 2022, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details