తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెండు వేరువేరు కేసుల్లో.. ఇద్దరు సైబర్ బాధితులు - hyderabad crime updates

హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో రెండు సైబర్ కేసులు నమోదయ్యాయి. ఫోన్​ పే కస్టమర్ కేర్ పేరుతో రూ.23వేలు.. లోన్ వచ్చిందని మాయమాటలతో రూ.25 వేలు దోచేశారు సైబర్ మోసగాళ్లు.

telangana latest news
హైదరాబాద్, జీడిమెట్ల

By

Published : Apr 11, 2021, 3:37 AM IST

సైబర్ క్రైమ్​ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా హైదరాబాద్ జీడిమెట్ల పీఎస్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి.

ఫోన్ పే కస్టమర్ అంటూ...

చింతల్​కు చెందిన మధుసూదన్(33) అనే వ్యక్తి ఫోన్ పే చేస్తున్న నగదు మధ్యలో ఆగిపోయింది. దీంతో ఫోన్ పే కస్టమర్ కేర్ నెంబర్​ను గూగుల్​లో వెతికి వారికి ఫోన్ చేశాడు. తాను పంపిన క్యూ ఆర్ కోడ్​ను స్కాన్ చేస్తే తిరిగి డబ్బులు వస్తాయనడంతో మధుసూదన్ స్కాన్ చేశాడు. అలా మూడు సార్లు క్యూ ఆర్ కోడ్​ను స్కాన్ చేయగా బాధితుడి అకౌంట్ నుంచి రూ. 23,363 డెబిట్ అయ్యాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

లోన్ పేరుతో...

షాపూర్ నగర్​కు చెందిన బాబు అనే వ్యక్తికి సైబర్ నేరస్తుడు ఫోన్ చేశాడు. రూ.70 వేల లోన్ వచ్చిందని మాయమాటలు చెప్పాడు. అది నిజమని నమ్మిన బాధితుడు మొదటి ఈఎంఐ కడితే మీ డబ్బులు అకౌంట్​లో క్రెడిట్ అవుతాయని చెప్పారు. 4500 ఇన్సూరెన్స్ కోసం రూ. 3357 సైబర్ నేరస్తుడికి పంపించాడు. లోన్ ప్రాసెస్ మధ్యలో ఆగిందని చెప్పటంతో మొత్తం నాలుగు విడతల్లో రూ. 25,357 వారికి పంపించాడు. అనంతరం బాధితుడిని మళ్లీ చెల్లించాలని తెలపటంతో.. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదీ చదవండి:నారాకోడూరులో విషాదం...రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details