నిర్మల్ జిల్లాలో విషాదం జరిగింది. ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని సారంగపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులు మృతిచెందడంతో కుటుంబసభ్యులు రోదించిన తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది.
విషాదం: చెరువులో పడి ఇద్దరు చిన్నారుల దుర్మరణం - చెరువులో పడి చిన్నారులు మృతి
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటూ కనిపించిన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా మారారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించిన తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో విషాదం
ఘటన జరిగిందిలా..
గ్రామానికి చెందిన నికేశ్(12), నిహల్ (11) అనే ఇద్దరు చిన్నారులు గ్రామ సమీపంలోని చెరువులో ఈతకు వెళ్ళారు. దుస్తులను చెరువు గట్టుపై వదిలి స్నానం చేసేందుకు దిగారు. ఈత రాకపోవడంతో చెరువులో మునిగి మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.