Accident on Lalaguda Flyover : హైదరాబాద్ లాలాగూడ ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరిగింది. లారీని కార్లు వెనుక నుంచి ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ బ్రేక్ డౌన్ ఫ్లైఓవర్‌పై ఒక్కసారిగా ఆగిపోయింది. లారీ వెనుక వస్తున్న ఓ కారు డ్రైవర్ గమనించి కొద్ది దూరంలో వాహనం నిలిపివేశాడు. మరో కారు అతి వేగంగా వచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టడంతో లారీ కిందికి దూసుకుపోయింది. కారు బెలూన్లు తెరుచుకోవడంతో ముప్పు తప్పింది.
Accident on Lalaguda Flyover : ఫ్లైఓవర్‌పై ఆగిపోయిన లారీ.. వెనుక నుంచి ఢీకొట్టిన కార్లు - లాలాగూడ ఫ్లైఓవర్‌పై ప్రమాదం
Accident on Lalaguda Flyover : హైదరాబాద్ లాలాగూడ ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని చూసి కొంత దూరంలోనే ఆగిపోయిన కారును.. వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ముందున్న కారు లారీ కిందకు దూసుకెళ్లడం వల్ల వాహనంలోని పలువురికి గాయాలయ్యాయి.
Accident on Lalaguda Flyover
Lalaguda Flyover Accident : సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే లారీ, కారు డ్రైవర్లు పరారయ్యారు.