ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవదహనం - రోడ్డు ప్రమాదం తాజా నేర వార్తలు
Nizamabad Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Nizamabad Road Accident
Nizamabad Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వెంటనే కారులో మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతులు జగిత్యాల జిల్లా వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Jun 27, 2022, 9:31 AM IST