నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6 బైక్‌లను స్వాధీనం చేసుకొని.. వారిని కోర్టులో హాజరు పరిచినట్లు ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ మురళీధర్ తెలిపారు.
చార్మినార్‌కు చెందిన సోహెల్ అలీ, మౌలాలికి చెందిన సయ్యద్ తాడెప్ మిత్రులిద్దరు గుట్కా, గంజాయి లాంటి వ్యసనాలకు అలవాటుపడ్డారు. జల్సాలకోసం డబ్బులు సరిపోక రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలే లక్ష్యంగా చేసుకొని ఈ చోరీలకు పాల్పడేవారు.
నల్లకుంట పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. పత్రాలు లేకపోవడంతో నిందితులను ఆరా తీశారు. విచారణలో బైక్‌ను చోరీ చేసినట్లుగా వారు ఒప్పుకున్నారు. కొట్టేసిన మరో 5వాహనాలను నిందితుల ఇంటి వద్ద నుంచి రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులు నల్లకుంట పరిధిలోని ఓ పాన్ షాప్‌లో సైతం దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మీర్‌చౌక్ పరిధిలో వాహనాల చోరీ కేసుకు సంబంధించి వారిద్దరూ గతంలో జైలుకి కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:మద్యం దుకాణంలో రూ.15 లక్షల నగదు చోరీ