తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెండు రైల్వే స్టేషన్ల మధ్య వ్యక్తి మృతి.. ఆత్మహత్యా? ప్రమాదమా? - తెలంగాణ వార్తలు

హైదరాబాద్​లోని అల్వాల్-బొల్లారం రైల్వే స్టేషన్ల నడుమ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు మృతి చెందాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో వ్యక్తికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించారు.

train-accident-at-bollaram-alwal-railway-station-and-one-person-dead-in-hyderabad
రెండు రైల్వే స్టేషన్ల మధ్య వ్యక్తి మృతి.. ఆత్మహత్యా? ప్రమాదమా?

By

Published : Feb 12, 2021, 2:00 PM IST

హైదరాబాద్​లోని అల్వాల్-బొల్లారం రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం సమయంలో ఆ వ్యక్తి మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని... మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక రైలు ఢీకొని చనిపోయాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఘటనా స్థలంలో వ్యక్తికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల వ్యక్తి అక్కడికక్కడే మరణించినట్లు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉంటే రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

ఇదీ చదవండి:పసిబిడ్డను చంపిన తల్లిదండ్రులకు యావజ్జీవం

ABOUT THE AUTHOR

...view details