ఇదీ చదవండి:Newly Wed Bride Elopes With Lover : పెళ్లైన మూడ్రోజులకే.. ప్రియుడితో జంప్
Viral video: మద్యం మత్తులో పాదచారి.. దారుణంగా కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్! - తిరుపతిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం
Viral Video: ఏపీ తిరుపతిలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. అన్నమయ్య కూడలిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కిశోర్ విధులు నిర్వహిస్తుండగా అడ్డదారిలో లారీ వచ్చి ఆగింది. దీంతో అతను లారీని తీయమని డ్రైవర్‌కు సూచించాడు. డ్రైవరు వాహనం పక్కకు తీస్తుండగా.. మద్యం మత్తులో ఉన్నఓ వ్యక్తి అడ్డగించాడు. ఆ వ్యక్తిని పక్కకు తప్పుకోవాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆదేశించాడు. అయిన అతను పక్కకు తప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన కిశోర్ మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిని చితకబాదారు. సదరు వ్యక్తి కొట్టవద్దంటూ చేతులు పట్టుకొని బతిమాలినా కనికరించలేదు. బూటు కాలితో తన్నుతూ దాడి చేశాడు. రోడ్డుపై కిందపడినా వదలకుండా వెంటపడి మరీ కొట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఎస్పీ సస్పెండ్ చేశారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం