ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
ట్రాక్టర్ బోల్తా.. బాలుడు మృతి - సూర్యాపేట జిల్లా
పొలం నుంచి ధాన్యం తరలిస్తోన్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో జరిగిందీ ఘటన.
కన్నారెడ్డి కుంట తండాకు చెందిన లకావత్ దేవరాజ్.. పొలం నుంచి ధాన్యం తరలిస్తోన్న సమయంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. వాహనం పైనుంచి కింద పడ్డ బాలుడు అభిరామ్.. తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు దేవరాజ్‌ను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:'లైంగిక వాంఛ తీర్చలేదని వృద్ధురాలిని నరికి చంపాడు'