Attack on Automobile Shop Owner: హైదరాబాద్ అత్తాపూర్‌లో ఆటోమొబైల్‌షాప్ యజమానిపై దుండగులు దాడిచేశారు. ఇటీవల రాజేంద్రనగర్‌లో క్యాబ్ డ్రైవర్‌పై దాడి మరవక ముందే తాజా ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సంపత్‌రెడ్డి అనే వ్యక్తి తన షాప్ ముందు నిలిపిన వాహనాన్ని పక్కకు తీయాలని సూచించాడు. ఈ క్రమంలోనే షాప్‌లోకి చొరబడిన 20మంది... సంపత్‌పై పిడిగుద్దులతో రెచ్చిపోయారు.
షాప్ ముందు నిలిపిన వాహనాన్ని తీయమన్నందుకు.. యాజమానిపై దుండగుల దాడి - ఆటోమొబైల్ షాప్ యాజమానిపై దుండగుల దాడి
Attack on Automobile Shop Owner: రాజేంద్రనగర్‌లో క్యాబ్ డ్రైవర్‌పై దాడి ఘటన మరవక ముందే తాజాగా అత్తాపూర్‌లో జరిగిన ఘటన నగరంలో కలకలం రేపుతోంది. షాప్ ముందు నిలిపిన వాహనాన్ని తీయాలని ఓ యాజమాని సూచించాడు. ఈ క్రమంలోనే 20 మంది దుండగులు ఒక్కసారిగా షాప్‌లోకి చొరబడి ఆయనపై దాడికి పాల్పడ్డారు.
Attack
దుకాణంలో ఉన్న సామగ్రిని ధ్వంసం చేసి... అందులోని వస్తువులతో కొట్టారు. తీవ్రంగా గాయపడిన సంపత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దండుగులంతా గంజాయి సేవించి ఉన్నారని... ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయి తనపై దాడి చేశారని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి సేవించి తనపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంపత్ రెడ్డి సైబరబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రను కోరారు.
ఇవీ చదవండి: