3 Year Old Child Abducted: షాపింగ్‌కు వచ్చిన కుటుంబం.. మూడేళ్ల చిన్నారి అపహరణ
17:33 October 08
నిజామాబాద్‌లో మూడేళ్ల చిన్నారి అపహరణ
నిజామాబాద్ నగరంలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం (3 year old child abducted) సృష్టించింది. నగరంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు మెట్‌పల్లికి చెందిన నూరిన్ సుల్తానా సల్మాన్ కుటుంబం తమ కుమార్తెతో కలిసి వచ్చారు. షాపింగ్ పూర్తి చేసుకుని కౌంటర్లో బిల్లు చెల్లిస్తున్న సమయంలో కుమార్తె.. అదృశ్యమైంది.
వెంటనే బయటకు వచ్చి చూసే సరికి... పాపను బురఖా ధరించినా మహిళలు అపహరించి.. ఆటోలో తీసుకెళ్లారని తల్లి నూరిన్ సుల్తానా, తండ్రి సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తమ కుమార్తె విడిచి పెట్టాలని తల్లి నూరిన్ సుల్తానా విజ్ఞప్తి చేస్తోంది.
ఇదీచూడండి: