వనపర్తి జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టణం సమీపంలోని ఈదుల చెరువులో ఈత కోసం వెళ్లిన తొమ్మిది మంది విద్యార్థుల్లో ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు.
వనపర్తిలో విషాదం.. చెరువులో గల్లంతైన ముగ్గురు విద్యార్థులు మృతి - students drowned in pond
సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. అందరూ కలిసి నీళ్లలో కేరింతలు కొట్టారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. ఆ నీరే వారి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చుతాయని తెలుసుకోలేక పోయారు. ఈతకు వెళ్లిన తొమ్మిది మంది విద్యార్థుల్లో ముగ్గురు గల్లంతయ్యారు.
వనపర్తిలో విషాదం
మంగళవారం రోజున మత్స్యకారులు చేపట్టిన గాలింపులో బండార్‌నగర్‌కు చెందిన మున్నా(14), అజ్మత్(14)ల మృతదేహాలు లభించాయి. ఇవాళ మరోసారి గాలింపు చేపట్టగా.. మరో విద్యార్థి భరత్ మృతదేహం బయటపడింది. ఈ ముగ్గురి మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులు వనపర్తిలోని సీవీ రామన్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.