తెలంగాణ

telangana

ETV Bharat / crime

అంత్యక్రియలకు హాజరై వస్తుండగా.. దుండగుల దాడి - Three people were seriously injured in an attack by unidentified persons in Warangal rural district

వరంగల్ రురల్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తుల దాడుల్లో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Three people were seriously injured in an attack by unidentified persons in Warangal rural district
అంత్యక్రియలకు హాజరై వస్తుండగా.. దుండగుల దాడి

By

Published : Jan 27, 2021, 12:10 PM IST

గుర్తుతెలియని వ్యక్తుల దాడుల్లో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన వరంగల్ రురల్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఒగ్లాపూర్ బస్టాండ్ సమీపంలో...

వరంగల్ అర్బన్ జిల్లా శివనగర్​కు చెందిన మంద జ్ఞానేందర్, సంతోష్, గుమ్మడి దాసుతో పాటు.. మరో ఇద్దరు మండలంలోని పసరగొండలో బంధువుల అంత్యక్రియలకు హాజరై వరంగల్​కు తిరిగి వస్తున్నారు.

బైక్​పై వచ్చిన ఇద్దరు..

ఈ క్రమంలో దామెర మండలం ఒగ్లాపూర్ బస్టాండ్ సమీపంలో బైక్​పై వచ్చిన ఇద్దరు దుండగులు.. వారి ద్వి చక్రవాహనాలను ఆపి కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలవ్వగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాధితులను ఎంజీఎంకు తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:నష్టాల్లోనే స్టాక్​మార్కెట్లు- 14 వేల 200 దిగువన నిఫ్టీ

ABOUT THE AUTHOR

...view details