భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలం మోతె పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో స్నానానికి దిగి శుక్రవారం ఓ ఆటో డ్రైవర్, తల్లి-ఆమె ఇద్దరు కుమారులు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు ఓ బాబును రక్షించగా.. మిగిలిన ముగ్గురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండాపోయింది. గల్లంతైన వారు ఏన్కూరు మండలం కాకర్లకు చెందిన ఆటోడ్రైవర్ నరసింహారావు, చంద్రుగొండ మండలానికి చెందిన రిహానా, ఆమె కుమారుడు ఇర్ఫాన్గా గుర్తించారు. మరో కుమారుడు ఇమ్రాన్ ప్రాణాలతో బయటపడ్డాడు.
గోదావరిలో ముగ్గురు గల్లంతు.. మృతదేహాలు లభ్యం - telangana latest crime news
గోదావరిలో స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు
18:17 May 20
గోదావరిలో ముగ్గురు గల్లంతు.. మృతదేహాలు లభ్యం
ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గల్లంతైన వారి కోసం పడవల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు, గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి మృతదేహాలను శనివారం మధ్యాహ్నం కనుగొన్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి..
Last Updated : May 21, 2022, 5:30 PM IST