Attack on Liquor Store Staff: ఏపీలోని కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ప్రభుత్వ మద్యం దుకాణంలో... మద్యం అప్పు ఇవ్వనందుకు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. గోపువానిపాలెంలోని మద్యం దుకాణం వద్దకు మందుబాబులు వచ్చారు. మద్యం అప్పుగా కావాలని అడిగారు. సేల్స్‌మెన్ గొరిపర్తి శ్రీనివాసరావు కుదరదని చెప్పాడు. దాంతో ఆగ్రహానికి గురైన మందుబాబులు... శ్రీనివాసరావుపై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
మద్యం అప్పుగా ఇవ్వనన్నాడు... మందుబాబులు చితకబాదారు... - మద్యం అప్పుగా ఇవ్వలేదని దాడి
Attack on Liquor Store Staff: మద్యం అప్పుగా ఇవ్వనన్నందుకు... మందుబాబులు వీరంగం సృష్టించారు. దుకాణ సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించారు. ఆ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజిలో నమోదయ్యాయి. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Attack on Liquor Store Staff
మందుబాబుల దాడిలో గాయపడిన గొరిపర్తి శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులు అధికార పార్టీకి చెందినవారు కావటంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడు కోరారు.
ఇవీ చదవండి:"స్వామిరారా" సీన్ రిపీట్.. ఎంత సింపుల్‌గా కొట్టేశాడో మీరూ చూడండి..!