తెలంగాణ

telangana

ETV Bharat / crime

Fixed Deposits Scam In Telugu Academy: ఎఫ్‌డీల్లో మాయాజాలం.. విత్‌డ్రా చేసిందెవరు? ఫోర్జరీ జరిగిందా?

తెలుగు అకాడమీ ఎఫ్‌డీల్లో మాయాజాలం (Fixed Deposits Scam In Telugu Academy)పై ప్రభుత్వం సీరియస్‌ అయింది. నిధుల గోల్​మాల్​పై సీసీఎస్​ దర్యాప్తు ప్రారంభించింది. రూ.26 కోట్లు ఏమయ్యాయి? విత్‌డ్రా చేసిందెవరు? ఫోర్జరీ జరిగిందా? లేదా అనే ప్రధానాంశాలపై విచారణ చేపట్టింది.

Fixed Deposits Scam In Telugu Academy
తెలుగు అకాడమీ

By

Published : Sep 30, 2021, 6:54 AM IST

Updated : Sep 30, 2021, 12:02 PM IST

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ (Fixed Deposits Scam In Telugu Academy)పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. నిగ్గు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ (Three Members Committee)ని నియమించింది. ఇంటర్‌బోర్డు కార్యదర్శి, బోర్డులోని అకౌంట్స్‌ అధికారి, కళాశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు ఇందులో సభ్యులు. ఈ వ్యవహారంపై అక్టోబరు 2వ తేదీలోపు నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోపక్క నిధుల గోల్​మాల్ వ్యవహారంపై​ (Fixed Deposits Scam In Telugu Academy) సీసీఎస్​ లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే డైరక్టర్ సహా కొంత మంది సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. మరికొంతమంది సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు అధికారుల పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారినుంచి వివరాలు సేకరించారు. బ్యాంకు, అకాడమీ సిబ్బంది కలిసి స్వాహా చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అకాడమీ పలు విడతలుగా యూబీఐ కార్వాన్‌, సంతోష్‌నగర్‌ శాఖల్లో రూ.43 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయగా అందులో మాయాజాలం (Fixed Deposits Scam In Telugu Academy) జరిగిన విషయం తెలిసిందే.

బ్యాంకు అధికారులు అప్పుడు ఎందుకు చెప్పలేదు?

‘‘యూబీఐ సంతోష్‌నగర్‌, కార్వాన్‌ శాఖల్లో ఉన్న రూ.43 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (Fixed Deposits)ను కాలపరిమితి పూర్తికాకుండానే తీసుకుంటామని బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాం. ఈ అంశంపై మాట్లాడేందుకు ఈ నెల 18న ఇద్దరు బ్యాంకు మేనేజర్లు వచ్చారు. అప్పటికే డిపాజిట్లు (Fixed Deposits Scam In Telugu Academy) విత్‌డ్రా అయి ఉంటే... ఆ విషయం వారు నాడు ఎందుకు చెప్పలేదు’’ అని అకాడమీ అధికారులు పోలీస్‌ అధికారులతో అన్నారు.

అకాడమీ ప్రతినిధులకు అంతా తెలుసు..

‘‘మా వద్ద ఉంచిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈ నెల 24 వరకూ వేర్వేరు తేదీల్లో అకాడమీవారు మొత్తం విత్‌డ్రా (Fixed Deposits Scam In Telugu Academy) చేసుకున్నారు. అకాడమీ ప్రతినిధులకు అంతా తెలుసు. మొత్తం రూ.26 కోట్లను వారే తీసుకున్నారు. రూ.17.05 కోట్లను ఒక సహకార బ్యాంకులో తొలుత డిపాజిట్‌ చేశారు. అనంతరం ఇందులో రూ.5.70 కోట్లను తెలుగు అకాడమీ తన స్టేట్‌బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేసింది. మిగిలిన రూ.11.35 కోట్లలో రూ.11.30 కోట్లను మరో సహకార బ్యాంకులో డిపాజిట్‌ చేశారు’’ అని యూబీఐ బ్యాంకు అధికారులు పోలీసులకు బుధవారం మరోసారి వెల్లడించారు.

పాత్రధారులు ఎంతమందో?

గోల్‌మాల్‌ వ్యవహారంలో పాత్రధారులు ఎంతమంది? అకాడమీ డైరెక్టర్‌ సంతకాలను ఫోర్జరీ చేశారా? బ్యాంకు వారు రూ.26 కోట్లకు స్పష్టమైన లెక్కలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? 18న తెలుగు అకాడమీ వారు బ్యాంకు మేనేజర్లతో సమావేశమవగా 24 వరకూ విత్‌డ్రా (Fixed Deposits Scam In Telugu Academy) చేసుకున్నారని బ్యాంకు రికార్డులు చెబుతున్నాయి. మరి ఈ విషయం అకాడమీ వారికి తెలియదా? అకాడమీ అధికారులు సొమ్మును విత్‌డ్రా చేసి (Fixed Deposits Scam In Telugu Academy) ఒక సహకార బ్యాంకుకు దాని నుంచి ఇంకో సహకార బ్యాంకుకు రెండు మూడు రోజుల్లోనే ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది.. ఇలాంటి ప్రశ్నలకు ఇటు పోలీసులు, అటు త్రిసభ్య కమిటీ సమాధానాలు రాబట్టాల్సి ఉంది.

ఏపీకి ఇవ్వాల్సింది రూ.124 కోట్లు

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈనెల 28 లోపు తెలుగు అకాడమీ సిబ్బంది, చరాస్తులను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉండగా.. ఆ లోపే రూ.43 కోట్ల డిపాజిట్‌ నిధుల్లో గోల్‌మాల్‌ (Fixed Deposits Scam In Telugu Academy) వ్యవహారం బయటకు వచ్చింది. రాష్ట్ర విభజన నాటికి అకాడమీ వద్ద ఉన్న రూ.213 కోట్లను అధికారులు పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్‌ చేశారు. నిధులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58: 42 నిష్పత్తిలో పంచుకోవాలి. ఆ ప్రకారం ఏపీకి రూ.124 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఏపీకి ఇవ్వాల్సిన నిధులు అందజేస్తామని, రూ.43 కోట్ల వ్యవహారం తేలేవరకు ఆగాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ నుంచి ఏపీకి ఎనిమిది మంది సిబ్బంది

అకాడమీలో మొత్తం పోస్టులు 160 ఉండగా...అందులో ఏపీకి 93, తెలంగాణకు 67 కేటాయించారు. వారిలో ప్రస్తుతం పనిచేస్తోంది 53 మందే. అందులో ఏపీకి 20, తెలంగాణకు 33 మందిని కేటాయించారు. ఏపీకి వెళ్లాల్సిన 20 మందిలో ఇప్పటికే 12 మంది ఆ రాష్ట్రంలోనే ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. అంటే ఎనిమిది మంది తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్నారు. త్వరలోనే వారికి రిలీవ్‌ ఆర్డర్లు ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి:Telugu Academy Funds scam: తెలుగు అకాడమీలో గోల్‌మాల్‌.. రూ.43 కోట్ల మాయాజాలం

Telugu academy assets: 'రెండు వారాల్లో ఏపీ ప్రభుత్వానికి నిధులు బదిలీ చేస్తాం'

Last Updated : Sep 30, 2021, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details