Three Police Died in Accident : ఏపీలోని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి.కొత్తకోట వద్ద రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఇన్నోవా కారు ఢీకొన్న ఘటనలో.. ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం.. ముగ్గురు పోలీసులు మృతి - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
Three Police Died in Accident : విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో చోటుచేసుకుంది. తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Three Police Died in Accident
కర్ణాటక శివాజీ నగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్ఐ అవినాష్‌తో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లు తిరుమలకు వస్తుండగా ప్రమాదం సంభవించింది. ఎస్ఐతో పాటు ఒక కానిస్టేబుల్, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.