ఉరివేసుకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య - suicide in hyderabad
18:54 May 21
ఉరివేసుకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన హైదరాబాద్ పాతబస్తీ హుస్సేని ఆలం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పార్థివడా చంద్రికాపురంలో నివాసముంటున్న మధుసూదన్ (40), సందీప్ కుమార్ (38), ప్రేమలత (32)... ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు.
మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన ముగ్గురికి పెళ్లిల్లు కాలేదు. వారికి తల్లి దండ్రులు కూడా లేరు. ఆర్థిక సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.