అతివేగంలో బైక్, టాటా ఏస్ వాహనంపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి - telangana varthalu
18:13 September 11
జాతీయ రహదారిపై ఘోరప్రమాదం.. ముగ్గురు మృతి
మేడ్చల్ శివారు అత్వెల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు... ఆ తర్వాత టాటా ఏస్ వాహనం పైకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో శామీర్పేట మండలం జగన్గూడ గ్రామానికి చెందిన నీరజ, లౌకిక్తో పాటు ములుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సుధీర్ అక్కడికక్కడే మృతి చెందారు.
ఇదీ చదవండి:ACCIDENT: తిరుమల కనుమదారిలో రోడ్డు ప్రమాదం.. మెదక్ జిల్లా వాసి మృతి