ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు గోకినపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మృతులు నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన భారతమ్మతో పాటు ఆమె మనువడు, ఆటో డ్రైవర్ మృతి చెందారు.
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు అక్కడికక్కడే మృతి - telangana news
ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన ఖమ్మం జిల్లా గోకినపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు అక్కడికక్కడే మృతి
గాయపడిన వారి బంధువుల రోదనలతో ఆస్పత్రి ఆవరణలో విషాద చాయలు అలుముకున్నాయి. తీవ్రంగా గాయపడిన బొడ్డు ఉపేందర్, తమలపాకుల ఉపేందర్లు చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: