తెలంగాణ

telangana

ETV Bharat / crime

వాట్సాప్ స్టేటస్... ఆయుధ అక్రమ వ్యాపారం గుట్టు రట్టు చేసింది

తనని చూసీ స్థానికులు భయపడాలన్న ఆలోచనతో హైదరాబాద్​లో ఓ యువకుడు పెట్టుకున్న వాట్సాప్‌ స్టేటస్‌ ఆయుధ అక్రమ వ్యాపారం గుట్టు రట్టు చేసింది. ముగ్గురిని అరెస్టు చేసిన సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు.. వారి నుంచి 95 కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

ఆయుధ అక్రమ వ్యాపారం గుట్టు రట్టు చేసింది
ఆయుధ అక్రమ వ్యాపారం గుట్టు రట్టు చేసింది

By

Published : Sep 6, 2021, 10:59 AM IST

Updated : Sep 6, 2021, 12:42 PM IST

బషీర్‌బాగ్‌ బ్యాంక్‌ కాలనీకి చెందిన ప్లంబర్‌ పనిచేసే సయ్యద్‌ ఖలీల్‌(20) రెండు తల్వార్లను రెండు చేతులతో పట్టుకుని ఫొటో తీసుకుని దాన్ని వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. కత్తులు పట్టుకున్న ఫొటో సమాజిక మాద్యమాల ద్వారా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చేరింది. శనివారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతడ్ని పట్టుకుని విచారించగా.. మలక్‌పేట పోలీస్‌ హాస్పిటల్‌లో లాండ్రీ పనులు చేసే అంకిత్‌ లాల్‌(21) తనకు అమ్మినట్లు తెలిపాడు.

సీజ్ చేసిన కత్తులతో నిందితులు

అంకిత్​లాల్‌ను అరెస్టు చేసిన పోలిసులు.. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఆసిఫ్‌నగర్‌ కాగజ్‌గూడ ప్రాంతానికి చెందిన రతన్‌ రాజ్‌కుమార్‌(55) సిద్దిఅంబర్‌ బజార్‌లో గిఫ్ట్స్‌ దుకాణం నడుపుతున్నాడు. లాభాలు లేక దిల్లీ నుంచి పదునైన కత్తులు, బాకులను తెచ్చి కొద్ది నెలలుగా విక్రయిస్తున్నాడు. అంకిత్‌లాల్‌కు చెప్పి కమీషన్‌ పద్ధతిలో ఒక్కో తల్వార్‌ను విక్రయిస్తున్నారు. అంకిత్‌లాల్‌ వ్యాపారం గురించి ఖలీల్‌కు వివరించగా అమ్మిపెట్టాడానికి రెండింటిని తీసుకున్నాడు. తీసుకున్న వాటితోనే ఫోటో తీసుకుని వాట్సాప్ స్టేటస్​లో పెట్టుకున్నాడు. తనంటే చుట్టుపక్కల వారికి భయం ఉండాలని తల్వార్లు పట్టుకున్న ఫొటోకి క్యాప్షన్​ రాసి పెట్టుకున్నాడు.

పోలీసులకు పట్టించిన స్టేటస్

కత్తులు విక్రయిస్తున్న రతన్‌ రాజ్‌కుమార్‌ గోడౌన్‌పై పోలీసులు దాడి చేయగా పదునైన కత్తులు, బాకులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తదుపరి విచారణ నిమిత్తం సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి:

Heart disease : రక్తప్రసరణ లోపాల మృతులు తెలంగాణలో 56 శాతం!!

Last Updated : Sep 6, 2021, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details