తెలంగాణ

telangana

ETV Bharat / crime

భద్రాచలంలో దొంగల బీభత్సం.. రూ. 3 లక్షలు చోరీ - bhadrachalam news today

ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరబడి మూడు లక్షలకుపైగా సొత్తును ఎత్తుకెళ్లారు. తలుపు గడియను కట్​చేసి ఇంట్లోకి ప్రవేశించి వస్తువులన్నింటిని చిందరవందరగా పడేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

thieves theft upto three lakh worth money at bhadrachalam
భద్రాచలంలో దొంగల బీభత్సం.. రూ. 3 లక్షల చోరీ

By

Published : Mar 13, 2021, 10:14 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని చర్లరోడ్ ఎల్​ఐసీ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తలుపు గడియ కట్​చేసి ఇంట్లోకి ప్రవేశించి.. బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు.

బెడ్ రూంలో ఉన్న క​బోర్డులను తెరచి వస్తువులన్నింటిని చిందరవందరగా పడేశారు. ఆ కబోర్డుల్లో దాచుకున్న సుమారు మూడు లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 30 వేల నగదును దోచుకెళ్లినట్లు యజమాని పేర్కొన్నాడు.

తెల్లవారుజామున ఇంటి యజమాని వచ్చి చూసేసరికి ఎవరో తలపులు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ స్వామి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి :శంషాబాద్​లో సుమారు కిలో బంగారం సీజ్​

ABOUT THE AUTHOR

...view details