రెండిళ్లలో చోరీకి పాల్పడిన దుండగులు బంగారు, నగదు దోచుకెళ్లారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాంధీనగర్ కాంట్రాక్ట్ బస్తీలోని పక్కపక్కనే ఉన్న ఇళ్లలో చోరీ జరిగింది.
తాళాలు పగలగొట్టి రెండిళ్లలో చోరీ - మంచిర్యాల జిల్లాలో బంగారం, నగదు చోరీ
తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. పక్కపక్కనే ఉన్న ఇళ్లలో దొంగతనం చేసి బంగారు, నగదు ఎత్తుకెళ్లారు.
తాళాలు పగలగొట్టి రెండిళ్లలో చోరీ
ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న చింతల శ్రీనివాస్ ఇంట్లో రెండు తులాల బంగారం, 13 వేల రూపాయల నగదు అపహరించారు. అదే బస్తీలో నివాసముండే నేర్వట్ల రాజలింగు ఇంటికి ఉన్న ప్రహారీ గోడ దూకి తాళాలు పగలగొట్టి నాలుగు తులాల బంగారం, 52 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.