కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లెలో దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు రెండిళ్లలో చోరీకి పాల్పడి రూ.90 వేల నగదు, నాలుగున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
రెండిళ్లలో చోరీ.. ఆలస్యంగా వెలుగులోకి..! - బంగారు, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
రెండిళ్లలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా బయటికి వచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటాక రెండిళ్లలో దొంగతనానికి పాల్పడిన దుండగులు నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లెలో ఈ ఘటన జరిగింది.
రెండిళ్లలో చోరీ.. ఆలస్యంగా వెలుగులోకి..!
తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనం జరగడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుండగులు బీరువాలు పగలగొట్టి సొమ్ములు అపహరించారు. ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడేసి వెెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.