కరీంనగర్ జిల్లా జమ్మికుంట పీఎస్ పరిధిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధిత కుటుంబీకులు వ్యక్తిగత పనులపై హైదరాబాద్‌కు వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇళ్లు గుల్ల చేశారు. 200గ్రాముల బంగారం, 600గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు వెల్లడించారు.
జమ్మికుంట పట్టణానికి చెందిన వ్యాపారి రవీందర్.. ఈ నెల 12న తన కుటుంబీకులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. తిరిగి స్వస్థలానికి చేరుకున్న బాధితులు.. ఇంట్లోకి దొంగలు చొరబడినట్లు గుర్తించారు. బీరువాను పగులగొట్టి.. బంగారు, వెండి నగలను ఎత్తుకెళ్లినట్లు తెలుసుకొని పోలీసులకు సమాచారమిచ్చారు.