నాగర్‌కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలోని శ్రీఉమా మహేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ఆభరణాలు, ఉత్సవ విగ్రహాలు, గంట ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వీటి విలువ దాదాపు రూ.లక్ష ఉంటుందని తెలిపారు.
శ్రీఉమా మహేశ్వర ఆలయంలో చోరీ - తెలంగాణ వార్తలు
నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరులోని శ్రీఉమా మహేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పూజారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఆలయంలో చోరీ, శ్రీఉమా మహేశ్వర ఆలయంలో చోరీ
పూజారి శివయ్య ఉదయం దేవాలయానికి వెళ్లగా ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పూజారి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఓబుల్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు