పేకాట ఆడుతూ ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులకు రాష్ట్ర మంత్రి తమ్ముడు దొరికిపోయాడు. న్యూ బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పలువురు పేకాట ఆడుతున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు నేతృత్వంలో పోలీసుల బృందం దాడులు చేసింది. ఇందులో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తమ్ముడు చామకూర నర్సింహారెడ్డితో పాటు మరో 12మంది దొరికారు. వారిని బోయిన్పల్లి పోలీసులకు టాస్క్ఫోర్స్ బృందం అప్పగించింది.
Arrest:పేకాటరాయుళ్లపై పోలీసుల కొరడా.. నిందితుల్లో మంత్రి తమ్ముడు
పేకాట ఆడుతూ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తమ్ముడు నర్సింహారెడ్డి టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. నర్సింహారెడ్డితో పాటు మరో 12 మందిని అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ సిబ్బంది.. బోయిన్పల్లి పోలీసులకు అప్పగించారు.
ప్రధాన నిందితుడైన నర్సింహారెడ్డితో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కౌడి సాయిలు(44), బి.నర్సింహారావు(65), ఎస్.హనుమంతు(58), బి.సుదర్శన్ రెడ్డి(64), కె.మోహన్ రెడ్డి(49), వి.భాస్కర్ రెడ్డి(49), కె.గోవర్ధన్ రెడ్డి(42), బి.జనార్దన్ రెడ్డి(42), పి.శ్రీనివాసరాజు(57), ఈ.వెంగల్ రెడ్డి(43), కే. నర్సిరెడ్డి(64), బత్తిని కృష్ణ(40)లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.1,40,740ల నగదు, 13 సెల్ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని బెయిల్పై విడుదల చేసినట్లు ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.
- ఇదీ చదవండి :తీవ్రస్థాయి కొవిడ్ రోగుల పాలిట సంజీవని!