ఇంటి స్థలం విషయంలో తమ్ముడు సొంత అన్నను హతమార్చాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన అశోక్(38), రాజు అన్నదమ్ములు. అశోక్ మేస్త్రీ పనిచేస్తుండగా.. రాజు ఇంటి వద్దనే ఉంటున్నాడు.
ఆస్తి కోసం అన్నను హతమార్చిన తమ్ముడు - కౌకుంట్లలో హత్య
ఆస్తుల కోసం బంధాలను సైతం తుంచేస్తున్నారు. సొంతవారు అని కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. రక్త సంబంధం కంటే ఆస్తులకే ప్రాధాన్యమిస్తున్నారు. ఓ ఇంటి స్థలం కోసం అన్నను తమ్ముడు హతమార్చాడు.
కౌకుంట్లలో అన్నను చంపిన తమ్ముడు
అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరగడంతో ఇటీవలే విడిపోయారు. సోమవారం ఇద్దరు ఇంటి స్థలం విషయంలో గొడవ పడ్డారు. అశోక్ తలపై రాజు రాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే చేవెళ్ల ఠాణాకు వెళ్లి కరోనాతో తన అన్న చనిపోయాడంటూ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.