నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన ఓ యువతి(22) నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద ఆత్మహత్యకు పాల్పడింది. బోటింగ్ పాయింట్ వద్ద సూసైడ్ నోట్‌తోపాటు పలు వస్తువులు కనిపించడంతో అటు వైపు వెళ్లిన నిర్వాహకులు గమనించి… వెంటనే ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు.
suicide: యువతి సూసైడ్.. లభించని మృతదేహం
నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన ఓ యువతి(22) నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ప్రాంతంలో సూసైడ్ నోట్‌తోపాటు పలు వస్తువులు కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్‌కు గల కారణాలను ఆరా తీస్తున్నారు.
suicide: యువతి సూసైడ్.. లభించని మృతదేహం
అక్కడికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్‌తోపాటు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మృతదేహం కనిపించలేదు. యువతి జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందా, లేక గుట్ట ప్రాంతాలకు వెళ్లి అఘాయిత్యానికి పాల్పడిందా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:LOAN APP: రూ.1.18 కోట్ల బదిలీలో బ్యాంకు అధికారుల పాత్ర ఉందా...?