తెలంగాణ

telangana

ETV Bharat / crime

యువకుడి ప్రాణం తీసిన ఫొటో సరదా..! - చెరువులో మునిగి యువకుడు మృతి

ఫొటో సరదా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్​లో చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

young man died
young man died

By

Published : Jun 18, 2021, 5:12 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్​లో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో సరదాగా చెరువు వద్దకు వెళ్లిన ఓ యువకుడు.. ఫొటో తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు.

హన్మకొండకు చెందిన మృతుడు ప్రణీత్(19).. హైదరాబాద్​లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు అతడి మిత్రులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:చేపల కోసం వెళ్లి.. చెరువులో పడి బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details