తెలంగాణ

telangana

ETV Bharat / crime

బైక్​లను ఢీకొన్న చెత్తసేకరణ వాహనం.. ఇద్దరికి గాయాలు - శారదా నగర్​లో ద్విచక్రవాహనాలను ఢీ కోట్టన మున్సిపల్​ వాహనం

అతిగా మద్యం సేవించి చెత్త సేకరణ వాహనం నడిపిన ఓ కార్మికుడు రెండు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టిన ఘటన హైదరాబాద్​లోని శారదానగర్​లో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయి.

The waste collection vehicle driver intoxication under the influence of alcohol in hyderabad
బైక్​లను ఢీకొన్న చెత్తసేకరణ వాహనం.. ఇద్దరికి గాయాలు

By

Published : Mar 16, 2021, 4:31 PM IST

మద్యం మత్తులో ఓ వ్యక్తి చెత్త సేకరణ వాహనం నడుపుతూ.. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన ఘటన హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని​ శారదానగర్​లో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. వాహనం నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నగరంలోని శారదానగర్‌లో యాదయ్య అనే వ్యక్తి జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను వాహనంలో వేసుకుని వెళుతున్న క్రమంలో గణపతి కాంప్లెక్స్‌ వద్ద రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. మద్యం మత్తులో వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రతిరోజు మంగమ్మ అనే మహిళా కార్మికురాలు ఆ వాహనం నడుపుతూ.. చెత్తను సేకరించే విధులు నిర్వర్తించేదని స్థానికులు తెలిపారు. తాను ఆసుపత్రికి వెళ్లడంతో యాదయ్యకు ఆ పనులు అప్పగించినట్లు సదరు కార్మికురాలు తెలిపింది.

ఇదీ చదవండి:ఎమ్మెల్యే దానం నాగేందర్ వియ్యంకుడిపై ఆగంతకుల దాడి

ABOUT THE AUTHOR

...view details