సూర్యాపేట ఎస్పీ కార్యాలయానికి సమీపంలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఒంటరిగా ఉన్న మహిళను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హతమార్చారు. మృతురాలి ఒంటిపైనున్న బంగారు, వెండి ఆభరణాలు మాయమవ్వడంతో.. దోపిడీ దొంగలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు .
జిల్లా కేంద్రానికి చెందిన జానకమ్మ (70) పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తోంది. కుమారుడు వాసు.. హైదరాబాద్లో నివాసముంటూ.. పని నిమిత్తం రోజూ సూర్యాపేటకు వచ్చి వెళుతుంటాడు. ప్రతి రోజు.. రాత్రి ఇంటికి వచ్చి, తల్లి యోగ క్షేమాలు తెలుసుకుని తిరిగి నగరానికి వెళ్లిపోతుంటాడు.