Mother suicide attempt: కన్న కొడుకుని తన కళ్ల ముందే పోలీసులు కొట్టారు... ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు.. ఈ దారుణాన్ని చూసి తట్టుకోలేక ఓ తల్లి తల్లడిల్లిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచక.. తానే తనువు చాలించాలనుకుంది. పురుగుల మందు తాగేసింది. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా టి-నర్సాపురం మండలంలో జరిగింది. టి-నర్సాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట శిబిరాలపై దాడులు చేసిన పోలీసులు.. అక్కడే ఉన్న పోతురాజుల సూర్యకిరణ్ అనే విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.
కళ్ల ముందే కన్న కొడుకును పోలీసులు కొడుతుంటే.. ఆ తల్లి ఏం చేసిందంటే..? - eluru district latest news
Mother suicide attempt: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడిని పోలీసులు చిత్రహింసలకు గురి చేయటం చూసి ఓ తల్లి హృదయం తల్లడిల్లింది. ఆ పరిస్థితుల్లో తన కొడుకును చూసి తట్టుకోలేక.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో జరిగింది.
the-mother-committed-suicide-attempt-when-she-could-not-see-her-son-being-beaten-by-the-police-in-eluru-district
తల్లిదండ్రులు విషయం తెలుసుకుని స్టేషన్‌కు వెళ్లగా.. తమ ఎదుటే సూర్యకిరణ్‌ను పోలీసులు కొట్టినట్లు బాధితుడి తండ్రి ఆరోపించారు. కొడుకుని చిత్రహింసలకు గురి చేయడంతో మనస్తాపానికి గురైన తల్లి సరోజిని.. పురుగుల మందు తాగిందన్నారు. ఆమెను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించామని.. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం ఏలూరు ఆస్పత్రికి తరలించామన్నారు.
ఇవీ చూడండి: