ఏపీలోని కర్నూలు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన 5 ఏళ్ల బాలుడిని పోలీసులు చాకచక్యంగా గుర్తించారు. స్వామినగర్‌కు చెందిన దేవి కుమారుడు నాని ఈ నెల 19న కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
స్నేహంగా నటిస్తూ బాలుడి కిడ్నాప్... నిందితుల అరెస్ట్
వారు కొన్ని నెలలుగా ఇంటి పక్కనే నివాసం ఉంటున్నారు. బాలుడితో స్నేహం నటించారు. ఎంచక్కా అనుమానం రాకుండా కిడ్నాప్ చేశారు. పోలీసుల దర్యాప్తులో దొరికిపోయారు. భిక్షాటన, దొంగతనం చేయడానికి బాలుడిని అపహరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది.
కర్నూలు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన బాలుడిని గుర్తించిన పోలీసులు
స్నేహంగా ఉంటూనే...
కొన్ని నెలలుగా ఇంటి పక్కనే స్నేహంగా ఉంటున్న నాగమణి, హరికృష్ణ దంపతులు బాలుడిని అపహరించారు. కిడ్నాప్ చేసి బాలుడిని డోన్ పట్టణంలోని మురళి అనే వ్యక్తి వద్ద ఉంచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం ఇంటి పక్కన ఉన్న వారే అపహరించారని గుర్తించి అరెస్టు చేశారు. భిక్షాటన, దొంగతనాలకు పాల్పడడంలో శిక్షణ ఇవ్వడం కోసమే.. బాలుడిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.