తెలంగాణ

telangana

ETV Bharat / crime

బాలికను బెదిరించి ఏడాదిగా అత్యాచారం - రేప్​ కేస్​ చిన్న చింతకుంట

మహబూబ్​నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికను మాయమాటలతో వంచించి.. ఏడాదిగా అత్యాచారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

pocso case, Mahbubnagar, chinna chintalakunta
అత్యాచారం వార్తలు,మహబూబ్ నగర్ జిల్లా, చిన్న చింతకుంట

By

Published : Apr 5, 2021, 10:54 PM IST

అభం శుభం ఎరుగని తమ కూతుర్ని మాయమాటలతో లొంగదీసుకుని ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మహబూబ్​నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని ఓ గ్రామంలో జరిగింది.

'12 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు పరిచయం చేసుకుని.. మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు' పోలీసులు తెలిపారు.

ఈ మధ్య కాలంలో బాలిక అనారోగ్యానికి గురవడం వల్ల అనుమానం వచ్చి తల్లిదండ్రులు ఆరా తీశారు. విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి:ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details