తెలంగాణ

telangana

ETV Bharat / crime

అటవీ అధికారులకు పోడు రైతుల మధ్య తోపులాట - badradri konthagudem district

భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో అటవీ అధికారులకు పోడు రైతుల మధ్య తోపులాట జరిగింది. పోడు భూములను దున్నటానికి అధికారులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్రమంగా పోడు భూములను స్వాధీనం చేసుకుంటున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.

అటవీ అధికారులకు పోడు రైతుల మధ్య తోపులాట
అటవీ అధికారులకు పోడు రైతుల మధ్య తోపులాట

By

Published : Jul 25, 2022, 5:01 PM IST

భద్రాద్రి కొత్తగుడెం జిల్లా టేకులపల్లిలో అటవీశాఖ అధికారులకు పోడు రైతులకు మధ్య జరిగిన వాగ్వాదం తోపులాటకు దారితీసింది. మురళీపాడు బీట్ మోట్లగూడెం కంపార్ట్మెంట్ లో జంగాలపల్లి - మొట్లగూడెం - రాయపాడు ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను అధికారులు దున్నటానికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు రైతులకు మధ్య వాగ్వాదం పెరిగి తోపులాట జరిగింది.

పోడు భూముల దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలనలో ఉండగానే అటవీశాఖ దౌర్జన్యంగా తమ భూములను స్వాధీనం చేసుకుంటుందని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. గతంలోనూ పోడు భూముల్లో కందకాలు తీసేందుకు అటవీశాఖ అధికారులు రాగా స్థానిక నాయకుల జోక్యంతో వివాదం సద్దుమనిగిందని పేర్కొన్నారు.

అటవీ అధికారులకు పోడు రైతుల మధ్య తోపులాట

ABOUT THE AUTHOR

...view details