జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చెర్లకొండాపూర్‌లో చెల్లిన చంపిన అన్నకు కోర్టు జీవిత జీవితఖైదు విధించింది. చెర్లకొండాపూర్ గ్రామానికి చెందిన పల్లికొండ గంగుకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు అశోక్ ఉన్నారు. వారికున్న మూడు ఎకరాల భూమి అమ్మి కుమార్తెల పెళ్లిలు చేశారు. మిగతా భూమి అమ్మకం విషయంలో కుటుంబ తగాదాలు చోటుచేసుకున్నాయి. 2015 మే 16న అశోక్.. చిన్న చెల్లి రోజాను రోకలి బండతో మోది హత్య చేశాడు.
అన్నకు జీవితఖైదు.. వదినకు ఏడాది జైలు శిక్ష - అన్నకు జీవితఖైదు
భూవివాదంలో సొంత చెల్లిని హతమార్చిన అన్నకు జగిత్యాల జిల్లా కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. హత్యకు సహకరించిన వదినకు ఏడాది జైలు శిక్షతోపాటు 15 వందల జరిమానా విధించింది.
తల్లి గంగును తీవ్రంగా గాయపరిచాడు. కేసు నమోదు చేసుకున్న రాయికల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీవాణి.. బాధితుల తరఫున వాదించారు. 24 మంది సాక్షుల విచారణ అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్.. నిందితుడు అశోక్‌కు జీవితఖైదు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు. ఐదు వేల జరిమానా కూడా విధించారు. ఇదే కేసులో ఏ2గా ఉన్న అశోక్ భార్యకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 15 వందల జరిమానా విధించారు.
ఇదీ చదవండి:రెండు పెళ్లిళ్లు చేసుకున్న భర్తకు భార్యల దేహశుద్ధి