తెలంగాణ

telangana

ETV Bharat / crime

ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి - బాలుడు మృతి

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోపాల్ పూర్​లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి ఓ బాలుడు మృతి చెందాడు.

boy fell under the tractor
బాలుడు మృతి

By

Published : May 9, 2021, 3:13 PM IST

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోపాల్ పూర్​లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు జంపయ్య.. పొలం వద్ద వరి ధాన్యాన్ని ట్రాక్టర్​లో నింపి తరలిస్తున్నాడు. విరామ సమయంలో.. జంపయ్య కుమారుడు శివ(10) మరో ఇద్దరు చిన్నారులతో కలిసి ట్రాక్టర్​ నీడలో కూర్చుని ఉన్నారు. ఇది గమనించని డ్రైవర్.. నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు.​

తండ్రితో పాటు పొలాన్ని చూడటానికి వచ్చిన శివ.. క్షణాల్లో విగతజీవిగా మారిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మంథని పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:కరోనాతో కార్పొరేటర్ కుమార్తె మృతి

ABOUT THE AUTHOR

...view details