స్నేహితునితో కలిసి సరదాగా సైకిల్ తొక్కేందుకు వెళ్లిన బాలుడు వరద నీటిలో శవమై తేలాడు. అతనితో పాటు వెళ్లిన మరో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం తట్టిఅన్నారంలోని హనుమాన్‌నగర్‌లో జరిగింది. దీంతో బాలుడి కుటుంబంతో తీవ్ర విషాదం నెలకొంది.
వరద నీరే బాలున్ని మింగేసింది
గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో హనుమాన్‌నగర్ కాలనీలో పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరింది. అదే కాలనీలో నివాసముండే రిశిక్ రామ్ రెడ్డి అనే బాలుడు తన స్నేహితుడైన మేఘనాథ్‌తో కలిసి సైకిల్ తొక్కేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ కాలనీలో ఉన్న వరద నీటిలో పడిపోయి మృత్యువాత పడ్డాడు. మరో బాలుడు మేఘనాథ్ చెట్ల పొదలను పట్టుకుని వేలాడుతుండగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని రక్షించారు. కాలనీలోకి చేరిన వరద నీటిని అధికారులు సకాలంలో తరలించేలా చర్యలు తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వర్షపు నీటిలో పడి బాలుడు మృతి ఇదీ చూడండి:Missing: నాలుగేళ్ల కుమారుడితో సహా తండ్రి అదృశ్యం!