Bike Collided Traffic Police: జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేస్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఒకే వాహనంపై వెళ్తున్నారు. అది చూసిన హోంగార్డు రాజు వారిని అడ్డుకున్నారు. అప్పుడు వారు పారిపోయే ప్రయత్నంలో హోంగార్డును ఢీకొట్టారు.
వాహనంపై ముగ్గురు వెళ్తుంటే హోంగార్డ్ చూశాడని.. వారు ఏం చేశారంటే? - జగిత్యాలలో బైక్ ప్రమాదం
Bike Collided Traffic Police: జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఒకే వాహనంపై వస్తున్న ముగ్గురు యువకులు తప్పించుకునే ప్రయత్నంలో ఓ హోంగార్డ్ను ఢీకొట్టి వెళ్లారు. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Bike Collided Traffic Police
అది గమనించిన స్థానికులు యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడ్డ హోంగార్డు రాజును చికిత్స నిమిత్తం వెంటనే ఆటోలో జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:మాట్లాడదామని పిలిచి.. కళ్లలో కారం కొట్టి.. రోకలిబండతో బాది.. భర్తను చంపిన భార్య