లారీ డ్రైవర్ హత్య కేసులో.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మండలంలోని హోతి శివారులోని ఓ వెంచర్లో.. సోమవారం రాత్రి జగదీష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణానికి చెందిన ఖాజా పాషా అనే మరో లారీ డ్రైవరే హత్యకు కారణమైనట్లు పోలీసులు గుర్తించారు.
లారీ డ్రైవర్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్ - సంగారెడ్డి నేరాలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిన్న రాత్రి హత్యకు గురైన లారీ డ్రైవర్ హత్యకు సంబంధించి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన ఖాజా పాషా అనే మరో లారీ డ్రైవరే హత్యకు కారణమైనట్లు వారు గుర్తించి అతడిని రిమాండ్‌కు తరలించారు.
lorry driver murder case
స్థానికంగా నలుగురు లారీ డ్రైవర్లు కలిసి చేసుకున్న విందు పార్టీలో జగదీష్(45), ఖాజా పాషా మధ్య వివాదం తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. ఆగ్రహించిన ఖాజాపాషా.. మద్యం మత్తులో నిద్రిస్తోన్న జగదీష్‌ను వెనక నుంచి వెళ్లి బండ రాయితో కొట్టి హత్య చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి:అ-అమ్మ, ఆ-ఆస్తి.. తల్లిని గెంటేసిన కొడుకు!