మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం దయరా గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో గుట్టుచప్పుడు కాకుండా కోళ్ల పందెం నిర్వహిస్తున్న పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.25వేల నగదు, 4 కోళ్లు, పది సెల్ఫోన్లు, 10 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించామని వెల్లడించారు.
కోళ్ల పందెం ముఠా గుట్టురట్టు.. 10మంది అరెస్ట్ - తెలంగాణ వార్తలు
మేడ్చల్లోని కీసర గ్రామ శివారులో గుట్టుగా కోళ్ల పందెం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పది మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్న వస్తువులను సీజ్ చేశారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు.
కోళ్ల పందెం గుట్టురట్టు, పదిమంది అరెస్ట్
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా బెట్టింగ్స్ జరుగుతున్నాయని సీఐ నరేందర్ గౌడ్ తెలిపారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడానికి పోలీసులు నిరంతరం గస్తీ కాస్తున్నారని వెల్లడించారు. పట్టబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇదీ చదవండి:టీకా తీసుకున్నా కరోనా వస్తుందా?