Accident on Hyderabad- vijayawada Highway: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జాతీయరహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న లారీ.. యూటర్న్ చేస్తుండగా ముందు వెళ్తున్న రెండు కార్లను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. బస్సు ఢీ కొట్టడంతో ముందున్న రెండు కార్లు.. లారీని ఢీ కొట్టాయి. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచి.. రాకపోకలకు అంతరాయం కలిగింది. సమచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మార్గంలో ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.