ఏపీలోని అనంతపురం జిల్లా ఎన్.ఎస్ గేట్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Anantapur road accident) చోటుచేసుకుంది. ఐరన్ లోడుతో ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయిబోయిన కారు.. అదే లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే చనిపోగా(Couple died in anantapur road accident) .. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Anantapur road accident: అనంతపురంలో రోడ్డు ప్రమాదం... తెలంగాణ దంపతులు మృతి - ఏపీ క్రైమ్ న్యూస్
ఏపీలోని అనంతపురం జిల్లా ఎన్.ఎస్ గేట్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయిన ఓ కారు.. అదే లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి (Couple died in road accident) చెందారు. మృతులు తెలంగాణకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.
Anantapur road accident
హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. గాయపడ్డ వెంకటేశ్, రాజు, సోమ్ల నాయక్, సీతమ్మను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెలంగాణ నుంచి హిందూపురం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతులు తెలంగాణలోని వనపర్తికి చెందిన శంకరమ్మ, ఈశ్వర స్వామిగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి:young man suicide: వివాహిత తనతో మాట్లాడటం లేదని యువకుడి ఆత్మహత్య