తెలంగాణ

telangana

ETV Bharat / crime

Banned drug injections: భారీగా మత్తు ఇంజక్షన్ల విక్రయం.. యువకుల అరెస్ట్ - విశాఖ జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Banned drug injections: ఏపీలోని విశాఖలో నిషేధిత మత్తును కలిగించే ఇంజక్షన్లు కలకలం సృష్టించాయి. వెంకోజీపాలెం వద్ద కొంతమంది యువకులు ఇంజక్షన్లను యువతకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించిన టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నిషేధిత మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

Banned drug injections
మత్తు ఇంజక్షన్లు

By

Published : May 2, 2022, 7:19 PM IST

Banned drug injections: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో నిషేధిత మత్తును కలిగించే ఇంజక్షన్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ ఆదేశాలతో టాస్క్​ఫోర్స్ సిబ్బంది నిఘా పెట్టారు. వెంకోజీపాలెం వద్ద ఓ ఆసుపత్రికి సమీపంలో కొంతమంది యువకులు ఇంజక్షన్లను విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

భీమిలికి చెందిన పి.శ్రీను (39), అల్లిపురానికి చెందిన పి.రవికుమార్‌(26)లు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి నిషేధిత 270 ఇంజక్షన్లు, రూ.1600 నగదు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 50 ఇంజక్షన్లు కలిగిన బాక్సును రూ.6 వేలకు కొనుగోలు చేసి.. ఒక్కో ఇంజక్షన్‌ను బయట రూ.300కు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో బాక్సు రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ ఇంజక్షన్‌ను శస్త్రచికిత్స అనంతరం పెయిన్‌ కిల్లర్‌గా ఉపయోగిస్తారని పోలీసులు వెల్లడించారు. వీటిని కేవలం ఆసుపత్రులు, మెడికల్‌ షాపుల్లో మాత్రమే విక్రయించాల్సి ఉందని టాస్క్​ఫోర్స్ ఏసీపీ త్రినాథరావు తెలిపారు.

ఇదీ చదవండి:Viral Video: ఇల్లు అద్దెకు కావాలని వచ్చారు... అక్కడే ఆగలేకపోయారు..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details