కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రూ.50 వేల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులు, రూ.7 వేల విలువ గల పటికను స్వాధీనం చేసుకున్నారు.
కాగజ్‌నగర్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీలు.. ఇద్దరిపై కేసు నమోదు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో నిషేధిత గుట్కా రవాణా జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. రూ.50 వేల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులు, రూ.7 వేల విలువ గల పటికను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
Task force police inspections in Kagaznagar
కాగజ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ద్వారా నిషేధిత గుట్కా రవాణా జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు చేపట్టినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ రానా ప్రతాప్ పేర్కొన్నారు. ఈ సోదాల్లో కిరాణ వ్యాపారి ఇంతియాజ్‌కు చెందిన రూ.50 వేల విలువ గల తంబాకు సంచులు, మరో వ్యాపారి నవీన్‌కు చెందిన 7 వేల విలువ గల పటిక సంచులు లభ్యమైనట్లు తెలిపారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు వివరించారు.