Student Suicide in Mancherial: కళాశాల యాజమాన్యం విద్యార్హత సర్టిఫికెట్లు ఇవ్వలేదని మనస్తాపంతో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగిన విద్యార్థి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన జక్కుల అంజిత్, హైదరాబాద్ ఆదిభట్ల ప్రాంతంలోని శ్రీ గాయత్రి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.
ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోవడంతో ఇంజినీరింగ్ చదవడానికి ఎంసెట్ పరీక్ష రాశాడు. ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించి, కళాశాలో ప్రవేశం పొందడానికి మెుదటగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికెట్ల కోసం కళాశాల యాజమాన్యాన్ని అంజిత్ తండ్రి సంప్రదించగా 40,000 బకాయిలు చెల్లించి ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలని మృతుని బంధువు తెలిపాడు. తన తండ్రి 30వేలు రూపాయలను కడతానని బతిమిలాడినా, కళాశాల యాజమాన్యం కనికరం లేకుండా వ్యవహరించిందని అతను పేర్కొన్నాడు.